Wednesday, March 14, 2012

భారతీయులారా ! మీకు తెలుసా?

ANY ONE TRANSLATE INTO YOUR MOTHER TONGUE AND MAKE A BLOG IF YOU LIKE THIS
ఈ ఆలోచనలు తో మీరు ఏకీభవిస్తే మరో పది మందికి మెయిల్ చేయండి.
                                        Google                 Yahoo

-------------------------------------------------------------------------------------------------

 భారతీయులారా !  మీకు తెలుసా? 
          ఈ బుల్లిటిన్ వ్రాసింది 19 - 11 - 2008 
          స్వర్గంలో ఆకలి వుండదు . దప్పిక వుండదు. స్వర్గం అనేది ఎక్కడుందో ఎవరికీ తెలీదు కానీ, భూమి మీద స్వర్గంతో సమానం ఏదిరా? అంటే అది అమెరికాయే అంటారు చాలామంది భారతీయులు. అలాంటి భూతల స్వర్గంగా భావించే అమెరికాలో ఈ సంవత్సరం ఆర్థిక సంక్షోభం..... 
           ఈ ఆర్థిక సంక్షోభానికి ముందే అంటే, 2007  లో దాదాపు 1,19,00,000 (ఒక కోటి పందొమ్మిది లక్షలు ) మందికి పైగా తినడానికి తిండి లేక అప్పుడప్పుడు పస్తులు కూడా వున్నారని తెలుసా? భారతీయులారా! మీకు తెలుసా? ఇందులో సుమారు 7,00,000 (ఏడు లక్షలు) మంది బాలలున్నారని తెలుసా? ఆ బాలల్లో ఎందరు "లింకన్" లు వున్నారో, ఎందరు "కెన్నడి" లు  వున్నారో, ఎందరు "ఒబామా" లు వున్నారో, ఎందరు "బుష్"లు వున్నారో కదా! 
          దాదాపు 3.5  కోటి మందికి పైగా మంచి పౌష్టిక ఆహారం కొనుక్కోవడానికి సరైన ఆదాయం లేక బాధపడుతున్నారని అమెరికా వ్యవసాయ శాఖ నివేదిక పేర్కొంది. ( 19 - 11 - 2008  తెలుగు దిన పత్రిక లో వ్రాసారు.) ఈ సంవత్సరం ఆర్థిక సంక్షోభం వలన యింకా పెరగ వచ్చును అని అంటున్నారు. ఆహార భద్రత పెంపొందిస్తానని చెప్పి బరాక్ ఒబామా చక్కగా గెలిచేసారు. దాని కోసం అయన 2015 కల్లా ఆకలితో బాధపడే బాలలు లేకుండా చేస్తానని ఒక ప్రకటన చేసారు. ఆహార భద్రత కోసం మరిన్ని నిధులు కేటాయించే అవసరాన్ని కలుగ చేయవచ్చును అని ''ఫుడ్ రిసెర్చ్ అండ్ యాక్షన్ సెంటర్ '' అధ్యక్షులు జేమ్స్ వియాల్ పేర్కొన్నారు.
          పై సమస్యను అధిగమించడానికి  2015 వరకు అయన పదవిలో వుంటార? కొత్తగా వచ్చే ప్రెసిడెంట్ యీతని పథకాలు కంటిన్యూ చేస్తారా? NO , అదే రాజకీయం. ఆహార భద్రత కోసం కొన్ని వేల కోట్ల నిధులు (కరెన్సీ)ని ప్రింటింగు చేసి వదిలేస్తే సరిపోతుందా? కరెన్సీని నమిలి మింగేస్తే ఆకలి తీరుతుందా? ఆలోచించండి మేధావుల్లరా! ఆహార భద్రత గురించి  చెప్పేవాళ్ళు నడుం వంచి ఆహారాన్ని పండిస్తే తెలుస్తుంది. అమెరికా గురించి మన కెందుకు అంటున్నారా? అలాంటి సమస్యతో మనము బాధ పడుతున్నాము. అందుకని ఆలోచించండి మేధావుల్లరా!
          రోటి - కాపాడ - మఖాన్. ఇది మన దేశంలో అందరు పలికే స్లోగన్. ఇది అందరికీ వుండాలి అనేది ధర్మం. అయితే "అతి సర్వత్ర వర్జయేత్" అన్నారు పెద్దలు.  ఆలోచించండి మేధావుల్లరా!
          ఒక మనిషికి రోటి (ఆహారం) ప్రతి రోజు కావాలి............కపడా (దుస్తులు) సరాసరి 4  నెలలకు ఒకసారి కావాలి ............. మరి మఖాన్ (గృహం) జీవితానికి ఒకటి కావాలి. ఇది ధర్మం. 
ధర్మాన్ని కాపాడండి. అది మిమ్మల్ని కాపాడుతుంది
           ధర్మ విరుద్ధంగా ప్రతి రోజు దుస్తులు కొనండి. ప్రతి రోజు gruhamu కొనండి. అంటే ధర్మం మిమ్మల్ని సర్వ నాశనం చేస్తుంది. అమెరికాలో అదే జరిగింది. ఆర్థిక సంక్షోభం, అప్పులపాలు అవుతారు. మన భారతదేశంలో  కూడా అలాంటి పరిస్థితి రాదు అని ఎవరైనా గ్యారంటీగా  చెప్పగలరా? చెప్పరు. ఎందుకంటే ఎవరూ ఆలోచించటం లేదు కదా! 
          ఉదాహరణకు 1 మనిషి 1000  నెలలు బ్రతుకుతాడంటే 1000 x 30 రోజులు = 30,000  రోజులు ఆహారం కావాలి. 4 నెలలకు 1 డ్రెస్  అనుకుంటే 1000 / 4 = 250 డ్రెస్ లు కావాలి. 1000 నెలలకు 1  ఇల్లు కావాలి. దీన్ని  బట్టి దేనికి ఎంత ప్రాముఖ్యం యివ్వాలో తెలుసుకోండి. ఆలోచించండి మేధావుల్లరా!
          అన్ని వృత్తుల్లోను, అవసరానికి  మించి వున్నారు, ఒక్క వ్యవసాయం లో తప్ప. అందుకే అన్ని విషయాల్లోనూ అధిక ధరలు వున్నాయి. దీనికంతా కారణం ఏమిటి? మేకాలే  విద్యా విధానం. కనుక ప్రస్తుతమున్న విద్యా విధానం మార్చుకుని వ్యవసాయానికి  ప్రాధాన్యత యిస్తూ, నిరుద్యోగ సమస్య తగ్గి స్వయం ఉపాధిగా బ్రతుకుతారు. ఎవరి ఆహారం వారె పండించుకుని తింటూ యితరులకు కాస్త పెడతారు. నిత్యావసరాల ధరలు తగ్గుతాయి.
మార్పు ఎక్కడో కాదు, నీ నుంచే మొదలు కావాలి.
 

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...