Saturday, March 17, 2012

నిజం - సత్యం
          నిజం కనపడుతుంది. సత్యం కనపడదు. 
          నిజం, సత్యం వేరు వేరు. 
          ఉదా||కు ప్రతి రోజు మనం వేసుకునే చొక్కా వేరు వేరుగా మారుతూ వుంటుంది. అది ఏ రోజుకు, ఆ రోజు నిజం. 
          కానీ ప్రతి రోజు మారకుండా వుంటుంది చొక్కా వెనుక దాగి వున్న మన శరీరం. అదే సత్యం. అంటే సత్యం ఏ రోజూ కనపడదు. నిజం ప్రతి రోజూ కనపడుతుంది. ఇది చొక్కా - శరీరం.  
          ప్రతి రోజూ కనపడే మన శరీరం నిజం. ఏ రోజూ కనపడని ఆత్మ సత్యం.           
          ప్రతి రోజూ కనపడే శరీరాన్ని ధరించిన ఆత్మ నిజం. ఏ రోజూ కనపడని, రూపం లేని పరమాత్మ సత్యం.  
          అలాగే భక్తుడు (నిజం)  - భగవంతుడు (సత్యం)


No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...