Monday, March 19, 2012

ప్రేమ ఎప్పుడు శాశ్వతం

                 ప్రేమ ఎప్పుడు శాశ్వతం
           ప్రేమ ఎప్పుడు శాశ్వతం దానికి కొలబద్ద కూడా లేదు. తక్కువ ఎక్కువ అని కూడా వుండదు. ప్రేమ అంటే ప్రేమే. ముందు వచ్చినా, మధ్యలో వచ్చినా, వెనక  వచ్చినా, అది ప్రేమే. అలాగే  అరిషడ్వర్గాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. వీటికి కూడా కొలబద్దలు వుండవు.  అయితే వచ్చింది ప్రేమా? లేక  మొహమా? కామమా? అనేది ప్రశ్న
          తరువాత, ప్రేమించి పెళ్ళిచేసుకొని పెద్దలను ఎదురించి విడిపోయే వారు ఎక్కువయ్యారు...ఇలాంటి వాళ్ళ వల్ల ప్రేమకు విలువ లేదు పెళ్లికి విలువ లేదు. ఈ అంచనా తప్పు. పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు కూడా విడిపోవడానికి ఆస్కారం వుంది. అక్కడక్కడ  విడిపోతున్నాయి. పెద్దలు కుదిర్చినా, ప్రేమలో పడ్డా, ప్రేమ పాళ్ళు తక్కువై, కామము (కోరికలు ఉదా || శుభ లగ్నం లో మాదిరి, ఆహ్వానం లో మాదిరి అవి కూడా కామమే అంటే మానసిక కామం ) పాళ్ళు ఎక్కువైతే  విడిపోవడమే  జరుగుతుంది. ఇది ఒక కారణం. మరిన్ని కారణాలకు  విడాకులు కథలు  చూడండి.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...