Monday, March 19, 2012

విడాకులు కథలు

          చాలామంది విడాకులు ఎందుకు తీసుకుంటున్నారు? 
          8 - 1 - 12 న వ్రాసినది ఇది.
   
          ఇది సమస్యా? దీని గురించి ఆలోచించాలా? అని చాలామంది అనుకోవచ్చును. కానీ, ఆలోచించండి మేధావుల్లరా? ఎందుకంటె, విశాఖ పట్టణంలో విడాకుల సంస్కృతి పెరుగుతున్నది అని, సరాసరి  ప్రతి రోజూ 10 కి తక్కువ లేకుండా వున్నట్లు ఒక T .V . చానల్ లో చెప్పారు. 
          విడాకులకు దారి తీసే పరిస్థితి ఏమిటి? అంటే ఒక రకంగా అది ఒక మానసిక సమస్య? అది పూర్వం రోజుల  నుండి అంటే పురాణాలకాలం నుండి అది ఒక మానసిక సమస్యే? అయితే ఆ కాలంలో సమస్యలు ఉమ్మడి కుటుంబంలో పెద్దలు తీర్చేవారు. కానీ, ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు లేవు. కనుక విడాకులకు దారి తీస్తున్నది.  ఉమ్మడికుటుంబ వ్యవస్థ అంటే దేవతల  వ్యవస్థ. చిన్నకుటుంబ వ్యవస్థ అంటే మానవుల వ్యవస్థ. వ్యక్తీ కుటుంబ వ్యవస్థ అంటే రాక్షసుల వ్యవస్థ. ఏ వ్యవస్థ బాగుంటుందో ఆలోచించండి మేధావుల్లరా? 
          తరువాత,మానసిక సమస్య అంటే.... అది ఏమి జబ్బు అని అకుకోవచ్చును. ప్రస్తుతం వున్నా సైన్సు ప్రకారం చూద్దాం.

పురుష అవయవములతో పుట్టినా........ అందులో కొందరు............

1) 100 % పురుష హార్మోన్లు, 0 % స్త్రీ హార్మోన్లు కలిగినవారు వుంటారు. వారినే సంపూర్ణ పురుషుడు అని చెప్పవచ్చును.
2) 75 % పురుష హార్మోన్లు, 25 % స్త్రీ హార్మోన్లు కలిగినవారు వుంటారు. వారినే పురుషుడు అని చెప్పవచ్చును.
3) 50 % పురుష హార్మోన్లు, 50 % స్త్రీ హార్మోన్లు కలిగినవారు వుంటారు. 
4) 25 % పురుష హార్మోన్లు, 75 % స్త్రీ హార్మోన్లు కలిగినవారు వుంటారు. వారినే  హిజ్డా  అని చెప్పవచ్చును. 
5) 0 % పురుష హార్మోన్లు, 100 % స్త్రీ హార్మోన్లు కలిగినవారు వుంటారు. వారినే  సంపూర్ణ హిజ్డా  అని చెప్పవచ్చును.

స్త్రీ అవయవములతో పుట్టినా........ అందులో కొందరు............
1) 100 % స్త్రీ హార్మోన్లు, 0 % పురుష హార్మోన్లు కలిగినవారు వుంటారు. వారినే సంపూర్ణ స్త్రీ అని చెప్పవచ్చును.
2) 75 % స్త్రీ హార్మోన్లు, 25 % పురుష హార్మోన్లు కలిగినవారు వుంటారు. వారినే స్త్రీ అని చెప్పవచ్చును.
3) 50 % స్త్రీ హార్మోన్లు, 50 % పురుష హార్మోన్లు కలిగినవారు వుంటారు. 
4) 25 % స్త్రీ హార్మోన్లు, 75 % పురుష హార్మోన్లు కలిగినవారు వుంటారు. వారినే  హిజ్డా  అని చెప్పవచ్చును. 
5) 0 % స్త్రీ హార్మోన్లు, 100 % పురుష హార్మోన్లు కలిగినవారు వుంటారు. వారినే  సంపూర్ణ హిజ్డా  అని చెప్పాలి. కానీ, చెప్పటం లేదు. వీరినే గతంలో  గయ్యాళీ లు అనేవారు.
          ఇప్పుడు పురుషులలో 5 రకాలు, స్త్రీలలో 5 రకాలు చెప్పుకున్నాము. వాటి వలన రాగలిగిన కాంబినేషన్లు అంటే 25 రకాలకు 25 రకాల ఫలితాలు వుంటాయి. అందులో కొన్ని కాంబినేషన్లు విడాకులు తీసుకుంటారు ( పూర్తి వివరాలు హిజ్డలు -రకాలు-విడాకులు- బుల్లిటిన్లో చుడండి) అందులో ఏ కాంబినేషన్స్ విడాకులుకు దారి తీస్తుంది అనేది. పెళ్ళికి ముందే జాతక చక్రాలు చూసి చెప్పవచ్చును. కానీ, అది 18 సం || లోపల అయితే పెద్దలు జాతకాలు చూసి చేయడానికి అవకాశం వుంటుంది. అంటే ఉమ్మడి కుటుంబ సంప్రదాయం. భారతీయ సంస్కృతిని గౌరవించాలి. అది ప్రస్తుతం వీలవుతుందా? ఆలోచించండి మేధావుల్లరా? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం పెళ్లి చేసుకునే దంపతులు విడాకులు తీసుకోవచ్చును. (గమనిక : మీ చుట్టు పక్కల విడాకులు తీసుకున్న వారు వుంటే అడగండి పెళ్లి సోమవారం అయ్యిందా అని కనుక్కోండి. అంటే సోమవారం పెళ్లి ఒక కారణం మాత్రమే) 
కాబోయే కార్మికులు ఎలా బ్రతకాలి?
          విడాకులు తీసుకోవడానికి మరొక కారణం. ఒకప్పుడు అంటే సైన్సు పుట్టినప్పుడు అన్ని పరికరాలు ఉదా ||కు కత్తెర, చాకు, స్పానరు , సుత్తి, వగైరాలు, అలాగే అన్ని రకాల విడి భాగాలూ ఇన్నో అన్ని స్ట్రాంగ్ (గట్టిగ) గ ప్రారంభంలో తయారు చేసారు. అప్పుడు ఆ వస్తువులు కొన్నవారు మళ్లీ కొనాలంటే కనీసం 50 సం||లు పైగా ఆగాలి. అప్పుడు కార్మికులందరూ చేతులు కట్టుకుని ఆ కాలం లో వున్న రాజు దగ్గరకు వెళ్లారు. విచారణలు అన్ని పూర్తయ్యాక చాలా త్వరగా విరిగిపోయే వస్తువులు చేయమని చెప్పారు పాలకులు.
          కొంత  కాలం అయ్యాక కార్మిక పోషకులు చేతులు కట్టుకుని నిలబడ్డారు. ఎందుకంటె, 100  మంది జనాభా అంటే ఉమ్మడి వ్యవస్థలో 6 లేదా 8  కుటుంబాలు మాత్రమే వుంటాయి. అంటే MAXIMUM 8  వాషింగ్  మిషన్లు, 8 మిక్సిలు, ఇలా అన్ని 8  చొప్పున అమ్మేస్తున్నారు. ఈ లోగా లెక్కలు వేసి కార్మిక పోషకులు  అంటే వ్యాపారవేత్తలు పాలకులు ముందు చేతులు కట్టుకుని నిలబడ్డారు. అప్పుడు ఉమ్మడి కుటుంబాలు విడగొట్టి చిన్న కుటుంబాలుగా చేసారు పాలకులు. పైగా స్లోగన్ చిన్న కుటుంబము చింతలు  లేని కుటుంబము అంటూ విడగొట్టి 20 - 25 వాషింగ్ మిషన్లు, 20 - ౨౫ మిక్సీలు, యిలా అన్ని20 - 25 చొప్పున అమ్మకము ప్రారంభించారు.
          మొదటసారి కార్మికులు, రెండవసారి, కార్మిక పోషకులు చేతులు కట్టుకుని నిలబడ్డారు. మళ్లీ వారు రాక ముందే ఈ మారు పాలకులు, వారిని పిలిపించి, మీ సంపాదన  పెంచుతాం, మాకేమి  యిస్తారు బహుమానం (లంచం) అని అన్నారు. బహుమతి తీసుకుని ఏమి చేసారంటే, స్త్రీ సాధికారికత అని స్త్రీని రెచ్చగొట్టి, భార్యభర్తలను విడాకులు తీసుకోండి అని విడాకుల చట్టం తెచ్చారు. అదేమంటే విడాకులు గురించి బిల్లు పెట్టాము. ఓట్లు పడింది. చట్టం చేసాము అని సింపుల్ గా తప్పించుకుంటారు. కాబట్టి యిప్పుడు మనిషికి  ఒకటి చొప్పున 100  మందికి  100  అమ్మవచ్చును అని పోషకులు కార్మికులు ఓట్లు వేసారు. లేదా వారి తరపున నాయకులు  వేసారు. అది అసలు విషయము. ఈ కారణం గా కూడా విడాకులు  తీసుకోవచ్చును  అంటే స్త్రీ సాధికారికత వలన కూడా డాకులు  తీసుకోవచ్చును.
కాబోయే లాయర్లు బ్రతకడానికి కూడా ఒక మార్గం
          విడాకులు తీసుకోవడానికి లాయర్లు కూడా మరొక కారణం.
          ఒకప్పుడు సినిమాల్లో పెదరాయుడు, నరసింహాల మాదిరి ఎప్పటికప్పుడు న్యాయానికి ఉపిరి పోసేవారు భారతీయులు. అప్పుడు న్యాయానికి ఉపిరి పోసే శక్తి కలిగి వున్నారు. ఎలాగంటే, వారంతా ఏక సంథా గ్రాహకులు. స్వంతంగా ఆలోచించే శక్తి కలిగిన వారు. దైవభక్తి, పాపభీతి కలిగి వుండే వారు. అదంతా భారతీయ విద్య విధానం అయిన మంత్ర శాస్త్రం, యోగ, ధ్యానం వలన వస్తుంది. మెకాలే విద్యా విధానంలో రాదు. కన్నుకు కన్ను, పన్నుకు పన్ను,అనేలా భయంతో కూడిన శిక్షలు ఉండేవి. అప్పుడు లంచం అనే అవినీతి కూడా వుండదు. అందుకే అప్పుడు సమస్యలు కూడా తక్కువగా ఉండేవి. 
          కానీ, ప్రస్తుతం వంద సార్లు కంటస్థం చేసినవారు, (అంటే ఇతరులు చెప్పిందే వంద సార్లు కంటస్థం చేస్తే, ఇంకా స్వంతంగా ఆలోచించే శక్తి ఎక్కడ వుంటుంది) అలంటి స్వంతంగా ఆలోచించే శక్తి లేని న్యాయాదీసులు న్యాయ వాదుల మాటలు నమ్మి విడాకులు ఇప్పిస్తున్నారు. ఎందుకంటె ఒక మంగలిని, ఒక చాకలిని, ఒక చర్మ కార్మికుని ఇలా కొన్ని రకాల వృత్తుల వారిని పోషించడానికి ఒక రీజన్ వుంది. నాచురల్ గా జుట్టు పెరుగుతుంది. బట్టలు మాసిపోతుంది. చెప్పులు తెగిపోతుంది. కానీ ఒక న్యాయదీసుని పోషించాలంటే ఇతర ప్రజలుకు  సమస్యలు సృష్టించాలి. అందులో ఒక భాగమే విడాకుల  చట్టం రావడానికి దోహదం చేసింది. భారతీయ సంస్కృతి ప్రకారం న్యాయ పీఠం, న్యాయాధికారి మాత్రమే వుంటారు. న్యాయవాదులు వుండరు. న్యాయాధికారి ఏక సంతాగ్రహి, దైవభక్తి, పాపభీతి, కలిగి స్వంతంగా ఆలోచించే మహా మేధస్సు కలిగి వుంటాడు. న్యాయ పీఠం, న్యాయాధికారి కేవలం ప్రజా సంక్షేమం కోరి సేవా భావంతో వుంటుంది. 
          భారతీయ సంస్కృతి, భారతీయ విద్యా విధానం  సేవా భావంతో వుంటుంది కనుకే, అది దైవ లక్షణాలు కలిగిన జాతి భారత జాతి. విదేశి సంస్కృతి, మెకాలే విద్యా విధానం సేవా భావం లేకుండా ప్రజలను, విద్య ఆర్తులను, ఫీజుల పేరుతో పీడించుకునే రాక్షస లక్షణాలు కలిగిన జాతి విదేశి జాతి.
          పైగా, ఆనాడు న్యాయాదీసులు జీతానికి కాకుండా అదొక సేవా కార్య క్రమముగా అనుకునే వారు. కానీ, ఈనాడు అది ఒక వుద్యోగం. వారు రిటైర్ అయ్యేవరకు ఖాళీగా కూర్చోబెట్టి జీతాలు ఇవ్వలేరు కదా. అందుకే సమస్యలు సృష్టిస్తున్నారు. 
          భారతీయ సంసృతి ప్రకారం రిటైర్మెంట్ అంటే తన కుమారుడికి త్వరగా వివాహం చేసి మనవడిని ఎత్తుకోవడంతో మొదలవుతుంది. (పూర్తి వివరాలు ఉనికిని కోల్పోతున్న మానవుడు అనే బుల్లిటిన్ చూడండి.) అంటే తను 18 - 20 మధ్యలో వివాహం చేసుకుని తన కుమారుడికి కూడా 18 - 20 మధ్యలో వివాహం చేసి 40 - 45 మధ్యలో  తన వృత్తిని అంటే తను చేస్తున్న పనిని తన కుమారులకు అప్పగించే వాడు. తను రిటైర్మెంట్ తీసుకునేవాడు. దానివలన యువకులు ఖాళీ లేకుండా ఉద్యోగ సమస్య లేకుండా వుండేది. ఉమ్మడిగా వుండేవారు. యువ భార్యాభర్తలు తన పిల్లలతో సమానంగా తమ పెద్దల ఆలనా పాలనా చూసేవారు. అప్పుడు విడాకులు వుండదు. ఎందుకంటె, ఎవడో (వకీలు) విని తనకు సంబంధం లేని ఇద్దరినీ విడాకుల పేరుతో విడగొట్టకుండా, తమకు సంబంధం వున్న కొడుకు కోడలును ప్రతి రోజు చూస్తూ వుంటారు  కనుక ఎవరి మనస్తత్వం ఎలాంటిదో ప్రతి రోజు గమనిస్తూ వుంటారు గనుక వారి పెద్దలే 99 % సమస్య రాకుండా చూసుకునే వారు. వస్తే పరిష్కారం చేసేవారు. అది ఇతరులు తల దూర్చేసమస్య కాదు వారి ఇంటి సమస్య గా బావించే వారు. కారణం ఉమ్మడి సంప్రదాయం  భారతీయ సంస్కృతి (దైవ సంస్కృతి) లో ఒక భాగం. విదేశి సంస్కృతి, (మెకాలే విద్యా విధానం ) రాక్షస సంస్కృతి. అందులో భాగమే డివైడ్ అండ్ రూల్ సంప్రదాయం. 
          ఇండ్లు కాలిపోవాలని అగ్నిమాపక దళం వారు యెప్పుడు అనుకోరు . యుద్ధాలు రావాలని మిలటరీవారు కూడా అనుకోరు. కానీ, ప్రజలకు సమస్యలు రావాలని కోరుకునే వార్లలో లాయర్లు ఒకరు. తప్పదు కదా వేరే పని రాదు. కంటస్థం చేసి చదివేసారు  లాయరు అయిపోయారు. బ్రతుకు తెరువుకు కోటు వేసుకున్నారు. కేసుల కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకు? అదే మెకాలే విద్యా విధానంలోని రాక్షసత్వం. ఇంకా జడ్జీలు  సరే సరి. మిలటరీ వారి మాదిరి, అగ్నిమాపక దళం  మాదిరి కూర్చోని  జీతాలు తీసుకోవడం ఇష్టం లేక వారు కూడా ప్రజలకు సమస్యలు రావాలనే కోరుకుంటారు. ఇలా యింకా కొన్ని కొత్త వృత్తులవారు వున్నారు. అలాంటి కొత్త వృత్తుల వారిని పోషించడానికి సమస్యలు ఎలా సృష్టించాలా? అని పాలకులు కూడా ఆలోచిస్తూ వుంటారు.
ఉమ్మడి కుటుంబాలను విడగొట్టడంలో అడిటర్ల పాత్ర
          1950  లో సం||నికి లక్ష రూపాయలు పైగా ఆదయ పన్ను కట్టేవారు ఒక భారతీయుడు.  అతనికి ఒక ఆడిటర్, " మీ పిల్లల్లు 7  మంది పేరున ఆస్తిని మార్చండి అని సలహా ఇచ్చాడు." 
           అప్పుడు భారతీయుడు, "ఆస్తిని వాళ్ళ పేరున ఎందుకు మార్చాలి. వాళ్ళేమన్న నాతో కష్టపడి పని చేస్తున్నారా? అయినా ప్రభుత్వాన్ని ఎందుకు మోసం చేయాలి? నేను న కుటుంబాన్ని పోషించాలి. అందుకే సంపాయిస్తున్నాను. ప్రభుత్వం అనేది కూడా పెద్ద కుటుంబం. అది మనల్ని పోషిస్తున్నది. కాబట్టి మోసం చేయకూడదు."  అన్నారు. ఇది నిజంగానే భారత దేశంలో జరిగింది. అందరు భారతీయునిలా  ఉండలేరు కదా! ఎందుకంటె మెకాలే విద్యా సంస్కృతి ప్రకారం డివైడ్ అండ్ రూల్ కదా! అందుకే భారతీయులంతా మెకాలీలుగా మారిపోతున్నారు. అందుకే కొందరు ఆడిటర్లు భార్యాభర్తలను కాకుండా ఉమ్మడి కుటుంబాల్లోని మనుషులను, మనసులను విడగొట్టి పరిపాలిస్తున్నారు. దీని వలన చిన్న కుటుంబాలుగా మారిన భార్యాభర్తలు సమస్యలుతీర్చే పెద్దలు లేక విడాకులకు వెళ్ళుతున్నారు. 
పూర్వకాలం లో విడాకులు
(ఇది మహాభారతం లో ఒక చోట వస్తుంది)
          ఇప్పుడు కూడా కొన్ని చోట్ల భర్త తిన్న పళ్ళెం లో భార్య తింటుంది. యెందుకో  తెలుసా? అంతే కాదు ముందుగా మొగాడికి అనే పద్ధతి ఎందుకు వచ్చిందో.
          పూర్వం స్టీలు పళ్ళేలు లేవు. అన్ని విస్తర్లే. అంటే కుట్టిన ఆకులు. అందులో ఉమ్మడి కుటుంబంలోని మగవారంతా ముందుగా భోజనం చేసేవారు. అందరు మగవార్లు  భోజనం చేసి లేవగానే  వారి వారి భర్తల ఆకులలో భార్యలు  భోజనం చేసేవారు. దాంతో ఎవరికి  వారు అందరు కలసి మెలసి అన్యోన్నంగా వున్నారు అనే విషయం అర్థమయ్యేది. ఒక వేల ఎవరైనా స్త్రీ తన భర్త ఆకులో కాకుండా విడి ఆకులో భోజనం చేస్తే ( అత్త కావచ్చు, పెద్ద కోడలు కావచ్చు, చిన్న కోడలు కావచ్చు, లేదా మధ్యలో కోడళ్ళు కావచ్చు) ఆరోజు రాత్రి పడక గదిలో వారి వారి భర్తలతో చెప్పేవారు. " ఏమండీ! అత్తగారు విడి ఆకులో భోజనం చేసారు. ఎందుకో మరి?" అని కోడళ్ళు లేదా
           "ఏమండీ! మీ వదిన గారు విడి ఆకులో భోజనం చేసింది. బహుశా బావ గారు అక్కయ్య గొడవ పడ్డారేమో?" అని చిన్న కోడళ్ళు లేదా 
          "ఏమండీ! చిన్న కోడలు విడి ఆకులో భోజనం చేసింది. చిన్నోడు ఏమైనా అన్నాడేమో" అని పెద్దావిడ. లేదా 
          "ఏమండీ! మీ మరదలు  విడి ఆకులో భోజనం చేసింది. మరిది గారు  ఏమైనా అన్నాడేమో" అని పెద్ద కోడళ్ళు.
          అంతే మరుసటి రోజు అందరు కూర్చుని పరిష్కారం  చేసుకునే వారు.  ఆ వేళ పరిష్కారం కాకపోతే సమస్యను  అందరు పరిశీలించి పరిష్కారానికి మార్గం వెతికేవారు. పరిష్కారం కాగానే  మళ్లీ వారిద్దరికీ ఒక ఆకులో భోజనం అంటూ ఒక చిన్న పండగ మాదిరి చేసుకునేవారు. అలా వచ్చింది విడాకుల కథ.  ఇలాంటి సంప్రదాయం ఇంకా భారత దేశంలో (కొన్ని కులాలు అని చెప్ప కూడదు. కొన్ని తెగలలో  వుంది. varikandarikee మన ధన్యవాదాలు అర్పించినా తప్పులేదు. వారి వలనే  యింకా మన భారతీయ సంస్కృతి బ్రతికుంది.

           మెకాలే విద్యా విధానంలో diverse  అంటారు. అంటే di  అంటే రెండు verse  అంటే మాటలు. అంటే ఇద్దరిదీ  రెండు మాటలుగా  వుంది ఒకే మాటగా లేదు అని అర్థం. 
          అసలు యిది అంతా వచ్చింది అంటే , 
         భారతీయులు  వారి ఆహారం ను ఆకులో పెట్టుకుని తినేవారు. ఎందుకంటె అన్నము సాంబారు, పెరుగు ఏదైనా కలుపుకుని తినే అలవాటు కదా! అది దైవ సంస్కృతి కదా ! ఎందుకంటె శుద్ధ శాకాహారం  అది
          మెకాలే  అని చెప్పొచ్చు , అభారతీయులది అని చెప్పొచ్చు, విదేశీయులది  అని చెప్పొచ్చు వారిది అంతా  రాక్షస సంస్కృతి. ఎందుకంటె అది పూర్తి  మాంసహారం. వారికీ పళ్ళేలు కూడా అవసరం లేదు. అలా కాలుతూ   వుండగానే ఎవరి వారు తీసుకుని తినేస్తారు. కొంతకాలానికి మన నుంచి శాకాహారం నేర్చుకున్న అది బ్రెడ్లు, బన్నులు, పఫ్లు కదా!వాటిని వాటినినుక్కుని లేదా అలా హాట్ బాక్స్ నుండి తీసుకుని తియ్యడమే. కాబట్టి అక్కడ  verse లు వేరుగా వుంది diverse  అనే పదం వచ్చింది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...