Monday, March 19, 2012

ప్రేమ ఎప్పుడు శాశ్వతం

                 ప్రేమ ఎప్పుడు శాశ్వతం
           ప్రేమ ఎప్పుడు శాశ్వతం దానికి కొలబద్ద కూడా లేదు. తక్కువ ఎక్కువ అని కూడా వుండదు. ప్రేమ అంటే ప్రేమే. ముందు వచ్చినా, మధ్యలో వచ్చినా, వెనక  వచ్చినా, అది ప్రేమే. అలాగే  అరిషడ్వర్గాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. వీటికి కూడా కొలబద్దలు వుండవు.  అయితే వచ్చింది ప్రేమా? లేక  మొహమా? కామమా? అనేది ప్రశ్న
          తరువాత, ప్రేమించి పెళ్ళిచేసుకొని పెద్దలను ఎదురించి విడిపోయే వారు ఎక్కువయ్యారు...ఇలాంటి వాళ్ళ వల్ల ప్రేమకు విలువ లేదు పెళ్లికి విలువ లేదు. ఈ అంచనా తప్పు. పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు కూడా విడిపోవడానికి ఆస్కారం వుంది. అక్కడక్కడ  విడిపోతున్నాయి. పెద్దలు కుదిర్చినా, ప్రేమలో పడ్డా, ప్రేమ పాళ్ళు తక్కువై, కామము (కోరికలు ఉదా || శుభ లగ్నం లో మాదిరి, ఆహ్వానం లో మాదిరి అవి కూడా కామమే అంటే మానసిక కామం ) పాళ్ళు ఎక్కువైతే  విడిపోవడమే  జరుగుతుంది. ఇది ఒక కారణం. మరిన్ని కారణాలకు  విడాకులు కథలు  చూడండి.

విడాకులు కథలు

          చాలామంది విడాకులు ఎందుకు తీసుకుంటున్నారు? 
          8 - 1 - 12 న వ్రాసినది ఇది.
   
          ఇది సమస్యా? దీని గురించి ఆలోచించాలా? అని చాలామంది అనుకోవచ్చును. కానీ, ఆలోచించండి మేధావుల్లరా? ఎందుకంటె, విశాఖ పట్టణంలో విడాకుల సంస్కృతి పెరుగుతున్నది అని, సరాసరి  ప్రతి రోజూ 10 కి తక్కువ లేకుండా వున్నట్లు ఒక T .V . చానల్ లో చెప్పారు. 
          విడాకులకు దారి తీసే పరిస్థితి ఏమిటి? అంటే ఒక రకంగా అది ఒక మానసిక సమస్య? అది పూర్వం రోజుల  నుండి అంటే పురాణాలకాలం నుండి అది ఒక మానసిక సమస్యే? అయితే ఆ కాలంలో సమస్యలు ఉమ్మడి కుటుంబంలో పెద్దలు తీర్చేవారు. కానీ, ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు లేవు. కనుక విడాకులకు దారి తీస్తున్నది.  ఉమ్మడికుటుంబ వ్యవస్థ అంటే దేవతల  వ్యవస్థ. చిన్నకుటుంబ వ్యవస్థ అంటే మానవుల వ్యవస్థ. వ్యక్తీ కుటుంబ వ్యవస్థ అంటే రాక్షసుల వ్యవస్థ. ఏ వ్యవస్థ బాగుంటుందో ఆలోచించండి మేధావుల్లరా? 
          తరువాత,మానసిక సమస్య అంటే.... అది ఏమి జబ్బు అని అకుకోవచ్చును. ప్రస్తుతం వున్నా సైన్సు ప్రకారం చూద్దాం.

పురుష అవయవములతో పుట్టినా........ అందులో కొందరు............

1) 100 % పురుష హార్మోన్లు, 0 % స్త్రీ హార్మోన్లు కలిగినవారు వుంటారు. వారినే సంపూర్ణ పురుషుడు అని చెప్పవచ్చును.
2) 75 % పురుష హార్మోన్లు, 25 % స్త్రీ హార్మోన్లు కలిగినవారు వుంటారు. వారినే పురుషుడు అని చెప్పవచ్చును.
3) 50 % పురుష హార్మోన్లు, 50 % స్త్రీ హార్మోన్లు కలిగినవారు వుంటారు. 
4) 25 % పురుష హార్మోన్లు, 75 % స్త్రీ హార్మోన్లు కలిగినవారు వుంటారు. వారినే  హిజ్డా  అని చెప్పవచ్చును. 
5) 0 % పురుష హార్మోన్లు, 100 % స్త్రీ హార్మోన్లు కలిగినవారు వుంటారు. వారినే  సంపూర్ణ హిజ్డా  అని చెప్పవచ్చును.

స్త్రీ అవయవములతో పుట్టినా........ అందులో కొందరు............
1) 100 % స్త్రీ హార్మోన్లు, 0 % పురుష హార్మోన్లు కలిగినవారు వుంటారు. వారినే సంపూర్ణ స్త్రీ అని చెప్పవచ్చును.
2) 75 % స్త్రీ హార్మోన్లు, 25 % పురుష హార్మోన్లు కలిగినవారు వుంటారు. వారినే స్త్రీ అని చెప్పవచ్చును.
3) 50 % స్త్రీ హార్మోన్లు, 50 % పురుష హార్మోన్లు కలిగినవారు వుంటారు. 
4) 25 % స్త్రీ హార్మోన్లు, 75 % పురుష హార్మోన్లు కలిగినవారు వుంటారు. వారినే  హిజ్డా  అని చెప్పవచ్చును. 
5) 0 % స్త్రీ హార్మోన్లు, 100 % పురుష హార్మోన్లు కలిగినవారు వుంటారు. వారినే  సంపూర్ణ హిజ్డా  అని చెప్పాలి. కానీ, చెప్పటం లేదు. వీరినే గతంలో  గయ్యాళీ లు అనేవారు.
          ఇప్పుడు పురుషులలో 5 రకాలు, స్త్రీలలో 5 రకాలు చెప్పుకున్నాము. వాటి వలన రాగలిగిన కాంబినేషన్లు అంటే 25 రకాలకు 25 రకాల ఫలితాలు వుంటాయి. అందులో కొన్ని కాంబినేషన్లు విడాకులు తీసుకుంటారు ( పూర్తి వివరాలు హిజ్డలు -రకాలు-విడాకులు- బుల్లిటిన్లో చుడండి) అందులో ఏ కాంబినేషన్స్ విడాకులుకు దారి తీస్తుంది అనేది. పెళ్ళికి ముందే జాతక చక్రాలు చూసి చెప్పవచ్చును. కానీ, అది 18 సం || లోపల అయితే పెద్దలు జాతకాలు చూసి చేయడానికి అవకాశం వుంటుంది. అంటే ఉమ్మడి కుటుంబ సంప్రదాయం. భారతీయ సంస్కృతిని గౌరవించాలి. అది ప్రస్తుతం వీలవుతుందా? ఆలోచించండి మేధావుల్లరా? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం పెళ్లి చేసుకునే దంపతులు విడాకులు తీసుకోవచ్చును. (గమనిక : మీ చుట్టు పక్కల విడాకులు తీసుకున్న వారు వుంటే అడగండి పెళ్లి సోమవారం అయ్యిందా అని కనుక్కోండి. అంటే సోమవారం పెళ్లి ఒక కారణం మాత్రమే) 
కాబోయే కార్మికులు ఎలా బ్రతకాలి?
          విడాకులు తీసుకోవడానికి మరొక కారణం. ఒకప్పుడు అంటే సైన్సు పుట్టినప్పుడు అన్ని పరికరాలు ఉదా ||కు కత్తెర, చాకు, స్పానరు , సుత్తి, వగైరాలు, అలాగే అన్ని రకాల విడి భాగాలూ ఇన్నో అన్ని స్ట్రాంగ్ (గట్టిగ) గ ప్రారంభంలో తయారు చేసారు. అప్పుడు ఆ వస్తువులు కొన్నవారు మళ్లీ కొనాలంటే కనీసం 50 సం||లు పైగా ఆగాలి. అప్పుడు కార్మికులందరూ చేతులు కట్టుకుని ఆ కాలం లో వున్న రాజు దగ్గరకు వెళ్లారు. విచారణలు అన్ని పూర్తయ్యాక చాలా త్వరగా విరిగిపోయే వస్తువులు చేయమని చెప్పారు పాలకులు.
          కొంత  కాలం అయ్యాక కార్మిక పోషకులు చేతులు కట్టుకుని నిలబడ్డారు. ఎందుకంటె, 100  మంది జనాభా అంటే ఉమ్మడి వ్యవస్థలో 6 లేదా 8  కుటుంబాలు మాత్రమే వుంటాయి. అంటే MAXIMUM 8  వాషింగ్  మిషన్లు, 8 మిక్సిలు, ఇలా అన్ని 8  చొప్పున అమ్మేస్తున్నారు. ఈ లోగా లెక్కలు వేసి కార్మిక పోషకులు  అంటే వ్యాపారవేత్తలు పాలకులు ముందు చేతులు కట్టుకుని నిలబడ్డారు. అప్పుడు ఉమ్మడి కుటుంబాలు విడగొట్టి చిన్న కుటుంబాలుగా చేసారు పాలకులు. పైగా స్లోగన్ చిన్న కుటుంబము చింతలు  లేని కుటుంబము అంటూ విడగొట్టి 20 - 25 వాషింగ్ మిషన్లు, 20 - ౨౫ మిక్సీలు, యిలా అన్ని20 - 25 చొప్పున అమ్మకము ప్రారంభించారు.
          మొదటసారి కార్మికులు, రెండవసారి, కార్మిక పోషకులు చేతులు కట్టుకుని నిలబడ్డారు. మళ్లీ వారు రాక ముందే ఈ మారు పాలకులు, వారిని పిలిపించి, మీ సంపాదన  పెంచుతాం, మాకేమి  యిస్తారు బహుమానం (లంచం) అని అన్నారు. బహుమతి తీసుకుని ఏమి చేసారంటే, స్త్రీ సాధికారికత అని స్త్రీని రెచ్చగొట్టి, భార్యభర్తలను విడాకులు తీసుకోండి అని విడాకుల చట్టం తెచ్చారు. అదేమంటే విడాకులు గురించి బిల్లు పెట్టాము. ఓట్లు పడింది. చట్టం చేసాము అని సింపుల్ గా తప్పించుకుంటారు. కాబట్టి యిప్పుడు మనిషికి  ఒకటి చొప్పున 100  మందికి  100  అమ్మవచ్చును అని పోషకులు కార్మికులు ఓట్లు వేసారు. లేదా వారి తరపున నాయకులు  వేసారు. అది అసలు విషయము. ఈ కారణం గా కూడా విడాకులు  తీసుకోవచ్చును  అంటే స్త్రీ సాధికారికత వలన కూడా డాకులు  తీసుకోవచ్చును.
కాబోయే లాయర్లు బ్రతకడానికి కూడా ఒక మార్గం
          విడాకులు తీసుకోవడానికి లాయర్లు కూడా మరొక కారణం.
          ఒకప్పుడు సినిమాల్లో పెదరాయుడు, నరసింహాల మాదిరి ఎప్పటికప్పుడు న్యాయానికి ఉపిరి పోసేవారు భారతీయులు. అప్పుడు న్యాయానికి ఉపిరి పోసే శక్తి కలిగి వున్నారు. ఎలాగంటే, వారంతా ఏక సంథా గ్రాహకులు. స్వంతంగా ఆలోచించే శక్తి కలిగిన వారు. దైవభక్తి, పాపభీతి కలిగి వుండే వారు. అదంతా భారతీయ విద్య విధానం అయిన మంత్ర శాస్త్రం, యోగ, ధ్యానం వలన వస్తుంది. మెకాలే విద్యా విధానంలో రాదు. కన్నుకు కన్ను, పన్నుకు పన్ను,అనేలా భయంతో కూడిన శిక్షలు ఉండేవి. అప్పుడు లంచం అనే అవినీతి కూడా వుండదు. అందుకే అప్పుడు సమస్యలు కూడా తక్కువగా ఉండేవి. 
          కానీ, ప్రస్తుతం వంద సార్లు కంటస్థం చేసినవారు, (అంటే ఇతరులు చెప్పిందే వంద సార్లు కంటస్థం చేస్తే, ఇంకా స్వంతంగా ఆలోచించే శక్తి ఎక్కడ వుంటుంది) అలంటి స్వంతంగా ఆలోచించే శక్తి లేని న్యాయాదీసులు న్యాయ వాదుల మాటలు నమ్మి విడాకులు ఇప్పిస్తున్నారు. ఎందుకంటె ఒక మంగలిని, ఒక చాకలిని, ఒక చర్మ కార్మికుని ఇలా కొన్ని రకాల వృత్తుల వారిని పోషించడానికి ఒక రీజన్ వుంది. నాచురల్ గా జుట్టు పెరుగుతుంది. బట్టలు మాసిపోతుంది. చెప్పులు తెగిపోతుంది. కానీ ఒక న్యాయదీసుని పోషించాలంటే ఇతర ప్రజలుకు  సమస్యలు సృష్టించాలి. అందులో ఒక భాగమే విడాకుల  చట్టం రావడానికి దోహదం చేసింది. భారతీయ సంస్కృతి ప్రకారం న్యాయ పీఠం, న్యాయాధికారి మాత్రమే వుంటారు. న్యాయవాదులు వుండరు. న్యాయాధికారి ఏక సంతాగ్రహి, దైవభక్తి, పాపభీతి, కలిగి స్వంతంగా ఆలోచించే మహా మేధస్సు కలిగి వుంటాడు. న్యాయ పీఠం, న్యాయాధికారి కేవలం ప్రజా సంక్షేమం కోరి సేవా భావంతో వుంటుంది. 
          భారతీయ సంస్కృతి, భారతీయ విద్యా విధానం  సేవా భావంతో వుంటుంది కనుకే, అది దైవ లక్షణాలు కలిగిన జాతి భారత జాతి. విదేశి సంస్కృతి, మెకాలే విద్యా విధానం సేవా భావం లేకుండా ప్రజలను, విద్య ఆర్తులను, ఫీజుల పేరుతో పీడించుకునే రాక్షస లక్షణాలు కలిగిన జాతి విదేశి జాతి.
          పైగా, ఆనాడు న్యాయాదీసులు జీతానికి కాకుండా అదొక సేవా కార్య క్రమముగా అనుకునే వారు. కానీ, ఈనాడు అది ఒక వుద్యోగం. వారు రిటైర్ అయ్యేవరకు ఖాళీగా కూర్చోబెట్టి జీతాలు ఇవ్వలేరు కదా. అందుకే సమస్యలు సృష్టిస్తున్నారు. 
          భారతీయ సంసృతి ప్రకారం రిటైర్మెంట్ అంటే తన కుమారుడికి త్వరగా వివాహం చేసి మనవడిని ఎత్తుకోవడంతో మొదలవుతుంది. (పూర్తి వివరాలు ఉనికిని కోల్పోతున్న మానవుడు అనే బుల్లిటిన్ చూడండి.) అంటే తను 18 - 20 మధ్యలో వివాహం చేసుకుని తన కుమారుడికి కూడా 18 - 20 మధ్యలో వివాహం చేసి 40 - 45 మధ్యలో  తన వృత్తిని అంటే తను చేస్తున్న పనిని తన కుమారులకు అప్పగించే వాడు. తను రిటైర్మెంట్ తీసుకునేవాడు. దానివలన యువకులు ఖాళీ లేకుండా ఉద్యోగ సమస్య లేకుండా వుండేది. ఉమ్మడిగా వుండేవారు. యువ భార్యాభర్తలు తన పిల్లలతో సమానంగా తమ పెద్దల ఆలనా పాలనా చూసేవారు. అప్పుడు విడాకులు వుండదు. ఎందుకంటె, ఎవడో (వకీలు) విని తనకు సంబంధం లేని ఇద్దరినీ విడాకుల పేరుతో విడగొట్టకుండా, తమకు సంబంధం వున్న కొడుకు కోడలును ప్రతి రోజు చూస్తూ వుంటారు  కనుక ఎవరి మనస్తత్వం ఎలాంటిదో ప్రతి రోజు గమనిస్తూ వుంటారు గనుక వారి పెద్దలే 99 % సమస్య రాకుండా చూసుకునే వారు. వస్తే పరిష్కారం చేసేవారు. అది ఇతరులు తల దూర్చేసమస్య కాదు వారి ఇంటి సమస్య గా బావించే వారు. కారణం ఉమ్మడి సంప్రదాయం  భారతీయ సంస్కృతి (దైవ సంస్కృతి) లో ఒక భాగం. విదేశి సంస్కృతి, (మెకాలే విద్యా విధానం ) రాక్షస సంస్కృతి. అందులో భాగమే డివైడ్ అండ్ రూల్ సంప్రదాయం. 
          ఇండ్లు కాలిపోవాలని అగ్నిమాపక దళం వారు యెప్పుడు అనుకోరు . యుద్ధాలు రావాలని మిలటరీవారు కూడా అనుకోరు. కానీ, ప్రజలకు సమస్యలు రావాలని కోరుకునే వార్లలో లాయర్లు ఒకరు. తప్పదు కదా వేరే పని రాదు. కంటస్థం చేసి చదివేసారు  లాయరు అయిపోయారు. బ్రతుకు తెరువుకు కోటు వేసుకున్నారు. కేసుల కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకు? అదే మెకాలే విద్యా విధానంలోని రాక్షసత్వం. ఇంకా జడ్జీలు  సరే సరి. మిలటరీ వారి మాదిరి, అగ్నిమాపక దళం  మాదిరి కూర్చోని  జీతాలు తీసుకోవడం ఇష్టం లేక వారు కూడా ప్రజలకు సమస్యలు రావాలనే కోరుకుంటారు. ఇలా యింకా కొన్ని కొత్త వృత్తులవారు వున్నారు. అలాంటి కొత్త వృత్తుల వారిని పోషించడానికి సమస్యలు ఎలా సృష్టించాలా? అని పాలకులు కూడా ఆలోచిస్తూ వుంటారు.
ఉమ్మడి కుటుంబాలను విడగొట్టడంలో అడిటర్ల పాత్ర
          1950  లో సం||నికి లక్ష రూపాయలు పైగా ఆదయ పన్ను కట్టేవారు ఒక భారతీయుడు.  అతనికి ఒక ఆడిటర్, " మీ పిల్లల్లు 7  మంది పేరున ఆస్తిని మార్చండి అని సలహా ఇచ్చాడు." 
           అప్పుడు భారతీయుడు, "ఆస్తిని వాళ్ళ పేరున ఎందుకు మార్చాలి. వాళ్ళేమన్న నాతో కష్టపడి పని చేస్తున్నారా? అయినా ప్రభుత్వాన్ని ఎందుకు మోసం చేయాలి? నేను న కుటుంబాన్ని పోషించాలి. అందుకే సంపాయిస్తున్నాను. ప్రభుత్వం అనేది కూడా పెద్ద కుటుంబం. అది మనల్ని పోషిస్తున్నది. కాబట్టి మోసం చేయకూడదు."  అన్నారు. ఇది నిజంగానే భారత దేశంలో జరిగింది. అందరు భారతీయునిలా  ఉండలేరు కదా! ఎందుకంటె మెకాలే విద్యా సంస్కృతి ప్రకారం డివైడ్ అండ్ రూల్ కదా! అందుకే భారతీయులంతా మెకాలీలుగా మారిపోతున్నారు. అందుకే కొందరు ఆడిటర్లు భార్యాభర్తలను కాకుండా ఉమ్మడి కుటుంబాల్లోని మనుషులను, మనసులను విడగొట్టి పరిపాలిస్తున్నారు. దీని వలన చిన్న కుటుంబాలుగా మారిన భార్యాభర్తలు సమస్యలుతీర్చే పెద్దలు లేక విడాకులకు వెళ్ళుతున్నారు. 
పూర్వకాలం లో విడాకులు
(ఇది మహాభారతం లో ఒక చోట వస్తుంది)
          ఇప్పుడు కూడా కొన్ని చోట్ల భర్త తిన్న పళ్ళెం లో భార్య తింటుంది. యెందుకో  తెలుసా? అంతే కాదు ముందుగా మొగాడికి అనే పద్ధతి ఎందుకు వచ్చిందో.
          పూర్వం స్టీలు పళ్ళేలు లేవు. అన్ని విస్తర్లే. అంటే కుట్టిన ఆకులు. అందులో ఉమ్మడి కుటుంబంలోని మగవారంతా ముందుగా భోజనం చేసేవారు. అందరు మగవార్లు  భోజనం చేసి లేవగానే  వారి వారి భర్తల ఆకులలో భార్యలు  భోజనం చేసేవారు. దాంతో ఎవరికి  వారు అందరు కలసి మెలసి అన్యోన్నంగా వున్నారు అనే విషయం అర్థమయ్యేది. ఒక వేల ఎవరైనా స్త్రీ తన భర్త ఆకులో కాకుండా విడి ఆకులో భోజనం చేస్తే ( అత్త కావచ్చు, పెద్ద కోడలు కావచ్చు, చిన్న కోడలు కావచ్చు, లేదా మధ్యలో కోడళ్ళు కావచ్చు) ఆరోజు రాత్రి పడక గదిలో వారి వారి భర్తలతో చెప్పేవారు. " ఏమండీ! అత్తగారు విడి ఆకులో భోజనం చేసారు. ఎందుకో మరి?" అని కోడళ్ళు లేదా
           "ఏమండీ! మీ వదిన గారు విడి ఆకులో భోజనం చేసింది. బహుశా బావ గారు అక్కయ్య గొడవ పడ్డారేమో?" అని చిన్న కోడళ్ళు లేదా 
          "ఏమండీ! చిన్న కోడలు విడి ఆకులో భోజనం చేసింది. చిన్నోడు ఏమైనా అన్నాడేమో" అని పెద్దావిడ. లేదా 
          "ఏమండీ! మీ మరదలు  విడి ఆకులో భోజనం చేసింది. మరిది గారు  ఏమైనా అన్నాడేమో" అని పెద్ద కోడళ్ళు.
          అంతే మరుసటి రోజు అందరు కూర్చుని పరిష్కారం  చేసుకునే వారు.  ఆ వేళ పరిష్కారం కాకపోతే సమస్యను  అందరు పరిశీలించి పరిష్కారానికి మార్గం వెతికేవారు. పరిష్కారం కాగానే  మళ్లీ వారిద్దరికీ ఒక ఆకులో భోజనం అంటూ ఒక చిన్న పండగ మాదిరి చేసుకునేవారు. అలా వచ్చింది విడాకుల కథ.  ఇలాంటి సంప్రదాయం ఇంకా భారత దేశంలో (కొన్ని కులాలు అని చెప్ప కూడదు. కొన్ని తెగలలో  వుంది. varikandarikee మన ధన్యవాదాలు అర్పించినా తప్పులేదు. వారి వలనే  యింకా మన భారతీయ సంస్కృతి బ్రతికుంది.

           మెకాలే విద్యా విధానంలో diverse  అంటారు. అంటే di  అంటే రెండు verse  అంటే మాటలు. అంటే ఇద్దరిదీ  రెండు మాటలుగా  వుంది ఒకే మాటగా లేదు అని అర్థం. 
          అసలు యిది అంతా వచ్చింది అంటే , 
         భారతీయులు  వారి ఆహారం ను ఆకులో పెట్టుకుని తినేవారు. ఎందుకంటె అన్నము సాంబారు, పెరుగు ఏదైనా కలుపుకుని తినే అలవాటు కదా! అది దైవ సంస్కృతి కదా ! ఎందుకంటె శుద్ధ శాకాహారం  అది
          మెకాలే  అని చెప్పొచ్చు , అభారతీయులది అని చెప్పొచ్చు, విదేశీయులది  అని చెప్పొచ్చు వారిది అంతా  రాక్షస సంస్కృతి. ఎందుకంటె అది పూర్తి  మాంసహారం. వారికీ పళ్ళేలు కూడా అవసరం లేదు. అలా కాలుతూ   వుండగానే ఎవరి వారు తీసుకుని తినేస్తారు. కొంతకాలానికి మన నుంచి శాకాహారం నేర్చుకున్న అది బ్రెడ్లు, బన్నులు, పఫ్లు కదా!వాటిని వాటినినుక్కుని లేదా అలా హాట్ బాక్స్ నుండి తీసుకుని తియ్యడమే. కాబట్టి అక్కడ  verse లు వేరుగా వుంది diverse  అనే పదం వచ్చింది.

Sunday, March 18, 2012

అర్థం చేసుకోండి ప్లీజ్..........

          గాడిద కాగితాలు తింటుందని అందరికీ తెలుసు. కానీ ఎందుకు  అని తెలుసా? అదే చెప్తున్నాను. గాడిద కూడా ముందు మానవుని లాగా ఆకులూ అలములు తినేది. ఒక్క గాడిద ఏంటి? అన్ని జంతువులూ (మానవుడు అనే జంతువుతో సహా) ఆకులూ అలములు తినే వారు. అందరు ఆరోగ్యంగా వుండేవారు. అయితే సైన్సు అభివృద్ధి కావడంతో మానవునికి తెలివి ఎక్కువై ఆకులూ అలములు వండుకుని తినడం నేర్చుకున్నాడు.  దాంతో జంతువు తో సమానమైన మానవుడు అనే వాడు జంతువుల సెక్షన్ నుండి వేరు పడ్డాడు. మానవుడు అని పిలిపించుకున్నాడు. అర్థం చేసుకోండి ప్లీజ్..........
           అప్పుడు మానవులలో కొందరికి భూత దయ, సేవ, ప్రేమ యిలాంటివి కలిగిన వారు తమకు వండుకున్న పదార్థాలను తమ పెంపుడు జంతువులకు పెట్టేవారు ఉదా || కు మనకు ఉపయోగ పడే జంతువులకు అంటే పిల్లికి, కుక్కకు, గాడిదలకు, అవుకు, లాంటి వాటికీ యింకా కొందరు పక్షులకు కూడా పెట్టేవారు. వారే దేవతలు అయ్యారు . కేవలం భూత దయ, ప్రేమ ఇవి రెండు వుండే చాలు. మనం కూడా దేవతలే.
         సైన్సు యింకా పెరిగింది. దాంతో పాటు కాలుష్యం పెరిగింది. మానవులకే ఆహారం దొరకలేదు. కాబట్టి ఏ జంతువుకు పెట్టక పోగా మళ్లీ back  to pevilion అన్నట్లు ఆకులూ అలములు కు వచ్చారు. అంతే మిగిలిన జంతువులు గడ్డి తినటం జరిగింది. అప్పుడు గాడిద కూడా గడ్డి తినేది. కాలుష్యం తగ్గి మళ్లీ ఆహారం వండుకునే మాదిరి పరిస్థితి వచ్చింది కానీ, ఈ సారి మానవుడు దేవత అయితే మళ్లీ తనకు కష్టమని జంతువులకు వండినది పెట్టడం మానేసారు. అంతే  దేవతల % తగ్గింది. కొందరే వండింది పెడుతున్నారు. దాంతో కొన్ని జంతువులు కుక్క, పంది యిలాంటివి పెంట తినడం నేర్చుకుంది. గాడిద గడ్డి తినేది. ఇప్పుడు పందులకు చక్కగా దుంపలు పెట్టి పోషిస్తున్నరులే ఎందుకంటే కోసుకుని తినడానికి. మళ్లీ కాలుష్యం పెరుగుతుంది. మళ్లీ  సమస్యలు. యిది చక్ర భ్రమణం. అయితే ఒక్కక సారి కాలుష్యం పెరగటానికి  ఒక్కొక రకం కారణం. దాన్ని యింకా సైన్సు కనిపెట్టలేదు. 
          ఈసారి సైన్సు పేపరు కనిపెట్టింది. గడ్డికి పోటి వుంది. పేపరుకు పోటి లేదు. తెలుసుకున్నాడు మానవుడు జంతువులకు అలవాటు చేసాడు. కానీ ముందుగా అర్థం చేసుకుంది  గాడిద. అలవాటు చేసుకుంది. అందువలన గాడిద పేపరు తింటుంది అని తరువాత తరం, అంటే మనందరికీ  వారికీ తెలిసింది. అయితే ఈ మధ్య  కాలుష్యం మరింత ఎక్కువైంది కదా! కాబట్టి ఆవులు గేదలు లాంటి జంతువులు  కూడా పేపరు ప్లాస్టిక్ ను తింటున్నాయి. కాలుష్యం తో నిండిన నీళ్ళును త్రాగుతున్నాయి.
           అయితే మానవుడు జంతువునుండి వేరు పడ్డాడు కాబట్టి, నీళ్ళను కొన్నుకుని త్రాగుతున్నాడు. కానీ సైన్సు ను పెంచుకోవడమే కదా పని.
          కాబట్టి నీళ్ళు కొనుక్కుని  త్రాగుతు, ఇంటర్నెట్ చాటింగ్ లో  మునిగి పోతున్నాడు. డబ్బిచ్చినా, నీళ్ళు  దొరొక లేదనుకోండి. నో ప్రాబ్లం. గాడిద గడ్డికి బదులు పేపరు, ఆవు ప్లాస్టిక్ తిన్నట్లుగా మానవుడు పెట్రోల్, కెరోసిన్, లేదంటే  తన మూత్రం కూడా త్రాగవచ్చును..  పైగా గో మూత్రం ఆరోగ్యకరం అంటున్నారు గా. భవిష్యత్తు తరానికి అంటే మన మనవలకు నీరు దొరక్క పోతే కష్ట  పడకుండా యిప్పట్నుంచే  ప్రజలకు అలవాటు చేస్తున్నారు.


                     పర్యావరణను దెబ్బ తీయడమే  కలియుగాంతం.
                  ప్రకృతిని గుప్పిట బంధించమే కలియుగాంతం 
                  పర్యావరణ పరి రక్షకులే దేవతలు  
                 పర్యావరణ భక్షకులే రాక్షసులు 
                 తటస్తులే మానవులు. ఏ జాతిలో మీరు 
                 వుండదల్చుకుంటారో  ఆలోచించుకోండి  ప్లీజ్..........
                     మూడో ప్రపంచ యుద్ధం మొదలైయ్యింది . 
                     కత్తులతో కాదు, బాంబులతో కాదు, 
                     కరెన్సిలతో యుద్ధం మొదలైయ్యింది. 
                     పర్యవసానం .......కాలుష్య ప్రేమికులు  పెరుగుతారు. 
                                               పర్యావరణ ప్రేమికులు తగ్గుతారు. 
                                              చెత్తను మరింత సృష్టిస్తారు. 
                                              జబ్బులనే ఆస్తిని పెంచుకుంటారు. 
                   తప్పదు కదా! రీ సైక్లింగ్ కంపెనీలు, ఫార్మస్యుటికల్ కంపెనీలు, 
                   కాబోయే డాక్టర్లు బ్రతకడానికి అదొక మార్గం కదా.

         

Saturday, March 17, 2012

నిజం - సత్యం
          నిజం కనపడుతుంది. సత్యం కనపడదు. 
          నిజం, సత్యం వేరు వేరు. 
          ఉదా||కు ప్రతి రోజు మనం వేసుకునే చొక్కా వేరు వేరుగా మారుతూ వుంటుంది. అది ఏ రోజుకు, ఆ రోజు నిజం. 
          కానీ ప్రతి రోజు మారకుండా వుంటుంది చొక్కా వెనుక దాగి వున్న మన శరీరం. అదే సత్యం. అంటే సత్యం ఏ రోజూ కనపడదు. నిజం ప్రతి రోజూ కనపడుతుంది. ఇది చొక్కా - శరీరం.  
          ప్రతి రోజూ కనపడే మన శరీరం నిజం. ఏ రోజూ కనపడని ఆత్మ సత్యం.           
          ప్రతి రోజూ కనపడే శరీరాన్ని ధరించిన ఆత్మ నిజం. ఏ రోజూ కనపడని, రూపం లేని పరమాత్మ సత్యం.  
          అలాగే భక్తుడు (నిజం)  - భగవంతుడు (సత్యం)


Wednesday, March 14, 2012

భారతీయులారా ! మీకు తెలుసా?

ANY ONE TRANSLATE INTO YOUR MOTHER TONGUE AND MAKE A BLOG IF YOU LIKE THIS
ఈ ఆలోచనలు తో మీరు ఏకీభవిస్తే మరో పది మందికి మెయిల్ చేయండి.
                                        Google                 Yahoo

-------------------------------------------------------------------------------------------------

 భారతీయులారా !  మీకు తెలుసా? 
          ఈ బుల్లిటిన్ వ్రాసింది 19 - 11 - 2008 
          స్వర్గంలో ఆకలి వుండదు . దప్పిక వుండదు. స్వర్గం అనేది ఎక్కడుందో ఎవరికీ తెలీదు కానీ, భూమి మీద స్వర్గంతో సమానం ఏదిరా? అంటే అది అమెరికాయే అంటారు చాలామంది భారతీయులు. అలాంటి భూతల స్వర్గంగా భావించే అమెరికాలో ఈ సంవత్సరం ఆర్థిక సంక్షోభం..... 
           ఈ ఆర్థిక సంక్షోభానికి ముందే అంటే, 2007  లో దాదాపు 1,19,00,000 (ఒక కోటి పందొమ్మిది లక్షలు ) మందికి పైగా తినడానికి తిండి లేక అప్పుడప్పుడు పస్తులు కూడా వున్నారని తెలుసా? భారతీయులారా! మీకు తెలుసా? ఇందులో సుమారు 7,00,000 (ఏడు లక్షలు) మంది బాలలున్నారని తెలుసా? ఆ బాలల్లో ఎందరు "లింకన్" లు వున్నారో, ఎందరు "కెన్నడి" లు  వున్నారో, ఎందరు "ఒబామా" లు వున్నారో, ఎందరు "బుష్"లు వున్నారో కదా! 
          దాదాపు 3.5  కోటి మందికి పైగా మంచి పౌష్టిక ఆహారం కొనుక్కోవడానికి సరైన ఆదాయం లేక బాధపడుతున్నారని అమెరికా వ్యవసాయ శాఖ నివేదిక పేర్కొంది. ( 19 - 11 - 2008  తెలుగు దిన పత్రిక లో వ్రాసారు.) ఈ సంవత్సరం ఆర్థిక సంక్షోభం వలన యింకా పెరగ వచ్చును అని అంటున్నారు. ఆహార భద్రత పెంపొందిస్తానని చెప్పి బరాక్ ఒబామా చక్కగా గెలిచేసారు. దాని కోసం అయన 2015 కల్లా ఆకలితో బాధపడే బాలలు లేకుండా చేస్తానని ఒక ప్రకటన చేసారు. ఆహార భద్రత కోసం మరిన్ని నిధులు కేటాయించే అవసరాన్ని కలుగ చేయవచ్చును అని ''ఫుడ్ రిసెర్చ్ అండ్ యాక్షన్ సెంటర్ '' అధ్యక్షులు జేమ్స్ వియాల్ పేర్కొన్నారు.
          పై సమస్యను అధిగమించడానికి  2015 వరకు అయన పదవిలో వుంటార? కొత్తగా వచ్చే ప్రెసిడెంట్ యీతని పథకాలు కంటిన్యూ చేస్తారా? NO , అదే రాజకీయం. ఆహార భద్రత కోసం కొన్ని వేల కోట్ల నిధులు (కరెన్సీ)ని ప్రింటింగు చేసి వదిలేస్తే సరిపోతుందా? కరెన్సీని నమిలి మింగేస్తే ఆకలి తీరుతుందా? ఆలోచించండి మేధావుల్లరా! ఆహార భద్రత గురించి  చెప్పేవాళ్ళు నడుం వంచి ఆహారాన్ని పండిస్తే తెలుస్తుంది. అమెరికా గురించి మన కెందుకు అంటున్నారా? అలాంటి సమస్యతో మనము బాధ పడుతున్నాము. అందుకని ఆలోచించండి మేధావుల్లరా!
          రోటి - కాపాడ - మఖాన్. ఇది మన దేశంలో అందరు పలికే స్లోగన్. ఇది అందరికీ వుండాలి అనేది ధర్మం. అయితే "అతి సర్వత్ర వర్జయేత్" అన్నారు పెద్దలు.  ఆలోచించండి మేధావుల్లరా!
          ఒక మనిషికి రోటి (ఆహారం) ప్రతి రోజు కావాలి............కపడా (దుస్తులు) సరాసరి 4  నెలలకు ఒకసారి కావాలి ............. మరి మఖాన్ (గృహం) జీవితానికి ఒకటి కావాలి. ఇది ధర్మం. 
ధర్మాన్ని కాపాడండి. అది మిమ్మల్ని కాపాడుతుంది
           ధర్మ విరుద్ధంగా ప్రతి రోజు దుస్తులు కొనండి. ప్రతి రోజు gruhamu కొనండి. అంటే ధర్మం మిమ్మల్ని సర్వ నాశనం చేస్తుంది. అమెరికాలో అదే జరిగింది. ఆర్థిక సంక్షోభం, అప్పులపాలు అవుతారు. మన భారతదేశంలో  కూడా అలాంటి పరిస్థితి రాదు అని ఎవరైనా గ్యారంటీగా  చెప్పగలరా? చెప్పరు. ఎందుకంటే ఎవరూ ఆలోచించటం లేదు కదా! 
          ఉదాహరణకు 1 మనిషి 1000  నెలలు బ్రతుకుతాడంటే 1000 x 30 రోజులు = 30,000  రోజులు ఆహారం కావాలి. 4 నెలలకు 1 డ్రెస్  అనుకుంటే 1000 / 4 = 250 డ్రెస్ లు కావాలి. 1000 నెలలకు 1  ఇల్లు కావాలి. దీన్ని  బట్టి దేనికి ఎంత ప్రాముఖ్యం యివ్వాలో తెలుసుకోండి. ఆలోచించండి మేధావుల్లరా!
          అన్ని వృత్తుల్లోను, అవసరానికి  మించి వున్నారు, ఒక్క వ్యవసాయం లో తప్ప. అందుకే అన్ని విషయాల్లోనూ అధిక ధరలు వున్నాయి. దీనికంతా కారణం ఏమిటి? మేకాలే  విద్యా విధానం. కనుక ప్రస్తుతమున్న విద్యా విధానం మార్చుకుని వ్యవసాయానికి  ప్రాధాన్యత యిస్తూ, నిరుద్యోగ సమస్య తగ్గి స్వయం ఉపాధిగా బ్రతుకుతారు. ఎవరి ఆహారం వారె పండించుకుని తింటూ యితరులకు కాస్త పెడతారు. నిత్యావసరాల ధరలు తగ్గుతాయి.
మార్పు ఎక్కడో కాదు, నీ నుంచే మొదలు కావాలి.
 

Tuesday, March 13, 2012

అతి సర్వత్ర వర్జయేత్

అతి సర్వత్ర వర్జయేత్

ANY ONE TRANSLATE INTO YOUR MOTHER TONGUE AND MAKE A BLOG IF YOU LIKE THIS
ఈ ఆలోచనలు తో మీరు ఏకీభవిస్తే మరో పది మందికి మెయిల్ చేయండి.
                                        Google                 Yahoo
-------------------------------------------------------------------------------------------------

అతి సర్వత్ర వర్జయేత్ 
          అతి సర్వత్ర వర్జయేత్ అని ఎవరు అన్నారు. ఎప్పుడు అన్నారు. ఎందుకు అన్నారు. అది ఎప్పటికైనా వర్తిస్తుందా! అసలు అతి అంటే ఏమి? దానికి కొలత ఏమైనా ఉందా? ఎలాంటి  కొలమానంలో అయినా 0 నుండి 100 వరకు వుంటుంది. అందులో 50 అనేది బ్యాలన్సుడ్ అని చెప్పుతారు. దాన్నే నార్మల్ అని కూడా చెప్పుకుంటే 51 నుండి 60 అతి, 61 నుండి 70 వరకు ఉత్తమ అతి 71 నుండి 80 వరకు మధ్యమ అతి 81 నుండి 90 వరకు అధమ అతి 91 పైన ఉంటే ఏమి చెప్పాలో అర్థం చేసుకోండి. అలాగే 50 కంటే తక్కువ వున్నా కూడా సమస్యే. దాన్ని 50 లాక్కురావాలి. అంటే నార్మల్ వరకు లాక్కుని  రావాలి.
          సత్య సాయి బాబా చెప్పే వారు..... మనం వేసుకునే చొక్కా ,చెప్పు కరక్టు సైజులో వుండాలి. అంటే నార్మల్ సైజులో వుండాలి. ఎక్కువైనా, తక్కువైనా సమస్యే అని. అలాగే బాబా గారు చెప్పేవారు........ సముద్రంలో నీళ్ళు ఉప్పగా వుండి త్రాగటానికి ఎలాగైతే పనికిరాదో, ధనం కూడా నిల్వ వుంటే పదిమందికి ఉపయోగపడదు. ధనం పదిమందికి ఉపయోగపడాలంటే, నదిలో నీళ్ళ లాగా ప్రవహిస్తూ వుండాలి అని అనే వారు.           
       అయితే సముద్రంలో నీళ్ళు కూడా వైద్యానికి పనిచేస్తుంది. ఎలా.. సముద్ర స్నానం వలన అనేక జబ్బులు నయం అవుతుంది అని అంటారు. అలాగే అతిగా అంటే అవసరానికి మించి ధనం వున్నవారు లేని వారికీ పంచి బ్యాలన్సు చేయడం కూడా వైద్యమే. 
              డాక్టర్లు చెపుతూ వుంటారు B .P ., SUGAR , లాంటి అనేక మైనవి  నార్మల్ గా లేకపోతే B .P .వుందని, SUGAR వుందని అంటారు అంటే నార్మల్  కి మించి వుంటే జబ్బుక్రిందకు వస్తుంది. 
               ఇలాగ అన్ని విషయాల్లో, అన్ని కాలాల్లో, అన్ని యుగాల్లో నార్మల్ కు మించితే అంటే అతి అయినా, మధ్యమ  అతి అయినా, అధమ అతి అయినా జబ్బే.
               ప్రేమ, జాలి, దయ, అనురాగం లాంటి గుణాలు  వుండాలి. కాని అతిగా వుండకూడదు. దాని వలన కూడా సమస్యే.
           మానవాభి వృద్ధిలో 60 వసంతాల గణతంత్ర భారత్ సాధించిన ప్రగతి అనన్య సామాన్యం...... అంటూ చాలా వ్రాసారు. 26 -1 -2010 న ఈనాడు  దినపత్రికలో. అది వారి తప్పుకాదు. అది ఒక వార్త. ప్రచురించారు. ఇంకా వివరాల్లోకి వెళ్ళితే ....... లక్ష మంది ప్రజలకు ఆనాడు 16 మంది వైద్యులు వుండేవారు. ఈనాడు ఆ సంఖ్యా  60 మందికి చేరింది అని వ్రాసారు.
             1950 లో 1 ,00 ,000 మందికి 16 డాక్టర్లు వున్నప్పుడు . . . .  ఉదా||కు 1 ,00 ,000 /16 =6 ,250 మంది పేషంట్లు వున్నట్లు లెఖ్ఖ. అంటే 1 డాక్టరు  రోజుకు 8 గం|| ప్రాక్టీసు చేస్తే అందులో గంటకు 4 చొప్పున పరీక్ష చేస్తే 32 మందికి పరీక్ష చేయవచ్చును. ఆ ప్రకారముగా నెలకు 32 x 30 = 960 మందికి అంటే సుమారు నెలకు 1 ,000 మందికి పరీక్ష చేయవచ్చును. ఈ 1 ,000  మంది ప్రతి నెలా పేషంట్ల రూపంలో రాగలరా? రాలేరు. పోనీ, ప్రతి 6 నెలలకు ఒకసారి రాగలరా? వచ్చారు అనుకుందాం. అంటే ఒక్కొక్క డాక్టరుకు 6 ,000 మంది పర్మనెంటు పేషంట్లు వున్నట్లు లెఖ్ఖ.2010  కి 60  మంది డాక్టర్లు ఉండేలా ప్రగతి సాధించింది అని అంటున్నారు. 
            అంటే మన దేశ జనాభాకు (1 ,30 ,00 ,00 ,000 /1 ,00 ,000 x 60 = 7 ,80 ,000 డాక్టర్లు  వున్నట్లు లెఖ్ఖ. ) అంటే ఉదా||కు 1 ,00 ,000 /60 = 1 ,600  మంది పేషంట్లు  ఒక్కొక్క డాక్టరుకు  వున్నట్లు లెఖ్ఖ. అంటే 1 డాక్టరు  (రోజుకు 8 గం|| ప్రాక్టీసు చేస్తే ) 1 ,000 మంది పేషంట్లు కావాలి. ఈ లెక్కన పేషంట్లు కనీసం రెండు నెలలకు ఒకసారి వచ్చి తీరాలి?  ఎందుకంటె డాక్టర్లు అతి వున్నారా? మధ్యమ అతిగా వున్నారా ? ఏ లెవెల్ లో అతిగా వున్నారో ఆలోచించండి !
       ఎందుకంటె . . . . . అవసరానికి మించిన డాక్టర్లు వుంటే ప్రగాతా? పతనానికి నాందియా? ఆలోచించండి మేధావుల్లరా! ముఖ్యంగా యువతలోని మేధావులు. 
         ఈ ప్రకారంగా అన్నిరకాల (వైద్య) పాత కుల వృత్తులలోనూ, కొత్త రకం కుల వృత్తులలోనూ, అవసరానికి మించి వున్నారు. అందుకే లాభాల కోసం వ్యాపారస్తులు  తయారుచేసిన వస్తువుల విషయంలోనూ, బట్టల విషయం లోనూ, ఒకటి కొంటె ఒకటి ఉచితం అంటున్నారు. వారికి నష్టాలు రాకుండా ప్రభుత్వం ప్యాకేజీలు యిస్తుంది. డాక్టర్లకు నష్టాలు రాకుండా ఆరోగ్య శ్రీ పథకం అనే పేరుతో నడుపుతున్నారు. ఇది ఎంత కాలం? డాక్టర్లను శాశ్వతంగా ఆరోగ్య శ్రీ పథకంలో పోషించాలంటే ప్రజలకు జబ్బులు ప్రతి సంవత్సరం రావాలి.  అలాగే ఎన్నో పథకాల కోసం ప్రజలు యిబ్బందులకు గురి కాక తప్పదు.  ఈ అతిగా వున్నాడు వలెనే ఆర్థిక సంక్షోభం. 
            ముఖ్య మంత్రులు కు కావలసిన అర్హతలు వున్నవారు (అతిగా ) ఎక్కువగా వున్నారు కనుకే  చిన్న రాష్త్రాలు కావాలని కోరుకుంటున్నాము .
            అంతే కాదు ఎం.పి. లు అయ్యే  అర్హతలు వున్నవారు (అతిగా) ఎక్కువ గా వున్నారు కనుకే ఆంధ్రలో లోక్ సభ స్థానాల సంఖ్య పెంచాలని కోరుకుంటున్నాము. 
         భవిష్యత్తులో ప్రధాన మంత్రులు కు కావలసిన అర్హతలు (అతిగా) ఎక్కువగా వుంటే గ్యారంటీగా భారత దేశం రెండు ముక్కలుగా కూడా అవుతుంది.  ఇదంతా ఎందువలన? అతిగా ఉన్నందుకే ...........అంటే అవసరానికి మించి వుంటే తప్పదు అనేక సమస్యలు.
       ఇలా ఎందుకు జరుగుతున్నదంటే మనం భారతీయ సంస్కృతిని, విద్యా విధానాన్ని మరచి, మెకాలే విద్యా విధానాన్ని,విదేశీ సంస్కృతిని నమ్ముకున్నందుకే .ఆలోచించండి మేధావుల్లరా!
         అలాగే మన ఆదాయం , ఖర్చులు, కూడా... నార్మల్ గా వుండాలి. 
           ఒకప్పుడు....ఉమ్మడి కుటుంబాల్లో ఒక్కరి మీద ఆధారపడి ఉంటుంది ఆదాయం ,ఖర్చులు. కుటుంబంలో ఎంతమంది వున్నా అందులో ఎంతమంది సంపాదనాపరులో, ఎంతమంది సంపాదించ లేని వారో (వయసు రీత్యా, ఆరోగ్య రీత్యా), అందరికీ సమానం గా కుటుంబ పెద్ద ఒకరు బాలన్సు చేసే వారు.భవిష్యత్తులో కుటుంబం ఎంత పెద్దది అవుతుందో తెలీదు అన్నట్లుగా, క్రింది తరాల వారికోసం కూడా సంపాయించి దాచేవారు. అది ధర్మం. అప్పుడు అతిగా సంపాయిస్తున్నారు అనేదానికి తావు లేదు. కానీ, మెకాలే విద్యా విదానం లో పడి భారతీయ ఉమ్మడి సంప్రదాయాలను మరచిపోయారు. నేను ఏమి చెప్పుచున్నానో చాలామందికి అర్థం కాదు. 
          ఉమ్మడి కుటుంబాలను చిన్న కుటుంబాలుగా , ఆ చిన్న కుటుంబాలను విడాకుల పేరుతో వ్యక్తి కుటుంబాలుగా తయారు చేసారు కొందరు. దాన్ని ఎక్కువ మంది ఆచరిస్తున్నందు  వలన యిప్పుడు అదే ధర్మం అని అనుకుంటే వ్యక్తి కుటుంబాలకు క్రింద తరం తో సంబంధం లేదు కదా! అలాంటప్పుడు ఒక వ్యక్తి తన వరకు ఎంత కావాలో అంత సంపాయించడం ధర్మం. అంతకంటే (అతిగా) ఎక్కువ సంపాయించడం అధర్మం. దాని వలనే సమస్యలు.  కాబట్టి సంపాదన (అతిగా) ఎక్కువగా వున్నవారు అంటే
          ఉదా: ఒక వ్యక్తి 1000 నెలలు బ్రతుకుతాడంటే, నెలకు ఎంత ఖర్చు కావాలో అంత x 1000  నెలలు సంపాయిస్తే చాలు. అలాంటి వారంతా  యోగా వైపు మరలండి. Maximum సమయం యోగాలో వుండండి. ఎవరూ దర్శించలేని వాటినంతా దర్శించండి. దర్శించిన దాన్ని పది మందికి చెప్పండి. దిన చర్యలో మార్పు తీసుకు రండి.  కేవలం ఆకలైనప్పుడు ఆహారం మిగిలిన సమయం యోగ, ధ్యానం లో వుండండి. ఇలాంటి వారె మహర్షులు, యోగులు, గంధర్వులు, వగైరా.. వగైరాలు. అవసరానికి మించి వుంటే చేస్తున్న ఉద్యోగానికి విరమణ చెప్పండి. యోగ, ధ్యానం వైపు మారండి సాయి సైనికులారా! మీ స్థానంలో మరొకరికి ఉద్యోగం వస్తుంది. ఎందుకంటె వ్యక్తి కుటుంబ సమాజంలో మీ భార్య అనే జీవి  కూడా సంపాయిస్తుంది కదా . అలాగే మీ పిల్లలు అనే జీవులకు మీరే అవకాశం యివ్వాలి. 
         అలాగే 1000 నెలలు బ్రతకడానికి ఒక ఇల్లు (గూడు) చాలు. మీకు మరొక ఇల్లు (అతిగా) వుంటే అమ్మేయండి. ఎందుకంటె ప్రభుత్వం అన్ని వ్యక్తి కుటుంబ జీవులకు విడివిడిగా ఇళ్ళు కట్టిస్తున్నారు అలాంటప్పుడు మీ యింటికి అద్దెకు ఎవరూ రారు . అలాంటప్పుడు ఆదాయం లేని ఆస్థి కదా! మీ అబ్బాయికి అంటారా! వ్యక్తి కుటుంబ సమాజంలో మీ అబ్బాయికి   ప్రభుత్వం కట్టిస్తుంది. లేదా మీ యింట్లోనే వుంటాడు. ఎందుకంటె, మీలా యోగ ధ్యానంలో వుండే వారంతా ఒక చోట చేరుతారు కదా! అదే ఆశ్రమం. ప్రస్తుతం పార్ట్ టైం గా వున్నా భజన మండళ్ళు, సాయి దేవాలయాలు ఫుల్ టైం ఆశ్రమాలుగా మార్చుకోండి.
         ఎంత  అవసరమో అంత వుండటం వలన మీరు ధర్మాన్ని పాటించినట్లు అవుతుంది. అదే సమయంలో త్వరగా మీరు విరమణ చేసినందువలన మరొకరికి ఉద్యోగ అవకాశం. మీరు ఫుల్ టైం ఆశ్రమవాసిగా యోగ ధ్యానం లో ఉన్నందు వలన స్వంత వాహనాలకు స్వస్తి పలుకుతారు అంటే కాలుష్యాన్ని నిరోధించినట్లే....యిలా ఎన్నో రకాలుగా కాలుష్యాన్ని, పర్యావరణాన్ని(ప్రకృతి)  బాలన్సు చేయవచ్చును. అంటే ధర్మ సంస్థాపనలో మీరు పాల్గొన్నట్లే, ధర్మ సంస్థాపన జరుగుతున్నట్లే. అంటే యిక్కడ అతిగా వున్న దాన్ని నార్మల్ గా  చేస్తున్నాము.
         యిదంతా సాయి భక్తులే, సాయి సేవకులే  ఎందుకు చేయాలి?  అంటే ధర్మ సంస్థాపనలో మీరంతా భాగస్తులు కావాలి. మీరంతా రామాయణంలోని వానర సైన్యం, కృష్ణావతారం లోని గోపాలురు  కాబట్టి. ధర్మ సంస్థాపనలో పాల్గొన్నవారే సాయి సైనికులు. మిగిలినవారంత సాయి భక్తులు, సాయి సేవకులు. పాండవ పక్షంలో ఉన్నవారంతా శ్రీకృష్ణుని భక్తులు, సేవకులు, శ్రీకృష్ణుని సైన్యం అంటే గోపాలురు. వారంతా దుర్యోధనుని పక్షంలో వున్నారు. ఆ ప్రకారం గ సాయి సైనికులు వేరు. సాయి భక్తులు వేరు. 
      ఒకవేళ మీకు 1000 నెలలుకు కావలసిన ఆదాయం లేకున్నా సాయి సైనికులుగా మరి యోగ ధ్యానం ఆశ్రమజీవితంలో వుంటే ( LOW B P ., LOW SUGAR మాదిరి ) అయిన సరే దాన్ని నార్మల్గా చేయడానికి సాయి వున్నాడు. ఎందుకంటె మీరు ధర్మ సంస్థాపనలో పాల్గొంటున్న సాయి సైనికులు కదా !
         కుక్క - గాడిద కథ ను చాల మంది వినే వుంటారు. అది ధర్మం. కుక్క పని (వృత్తి) కుక్క చేయాలి. గాడిద పని (వృత్తి) గాడిద చేయాలి. అదే ధర్మం గాడిద ధర్మం  తప్పింది. యజమాని దగ్గర నడ్డి విరుచుకుంది. విన్నారు కదా! అలాగే మానవుని ధర్మం మాత్రమే మానవుడు చేయాలి. మానవుని ధర్మాలు ఏమిటి? ఎన్ని రకాలు? అవి ఎన్నో? అందులో వృత్తి ధర్మం చెప్పుకుందాం. డాక్టరు తన వృత్తి తప్ప మరొక వృత్తి వైపు కన్నెత్తి చూడకూడదు. ఉపాద్యాయుడు తన వృత్తి తప్ప మరొక వృత్తి వైపు కన్నెత్తి చూడకూడదు. JUST LIKE కుక్క గాడిద కథలో మాదిరి. అక్కడ యజమాని గాడిద నడ్డి విరిచాడు. మానవుల్ని ఎవరు విరుస్తారు అని అందరూ అనుకుంటారు? అందుకే ధర్మాన్ని తప్పుతున్నారు. మన యజమాని భగవంతుడు. 
           మానవుడు అనే  యజమాని పాత్ర వేసి గాడిద నడ్డి విరిచాడు. కానీ, భగవంతుడు అనే యజమాని దయామయుడు కరుణామయుడు. అయన దయను కరుణను అందుకున్నవారంతా తెలిసో తెలియకో తమ వృత్తి తో పటు మరొక వృత్తిని చేపట్టి వుంటే దాన్ని వదిలినట్లైతే వారంతా సాయి  సైనికులే. సాయి భక్తులు సాయి సేవకులు అందరూ ఒకే వృత్తిని అంటి పెట్టుకుని మిగిలిన వృత్తులను ప్రక్కన పెట్టి సాయి సైనికులు గా మారితే అదే ధర్మ సంస్థాపన.
Related Posts Plugin for WordPress, Blogger...